మహాప్రస్థానంలో ఉమామహేశ్వరికి తుది వీడ్కోలు
టీడీపీ వ్యవస్థాపకుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి పార్ధివదేహానికి ఈ రోజు పలువురు ప్రముఖులు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో నివాళులర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఉమామహేశ్వరి పాడెను ఆమె సోదరులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ మోశారు. తరువాత పార్ధివ దేహానికి హిందూ సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. భర్త శ్రీనివాస్ ఆమె చితికి నిప్పంటించారు. ఉమామహేశ్వరి అంతిమ సంస్కారాలకు టీడీపీ అధినేత చంద్రబాబుతోసహా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.