NewsNews AlertTelangana

యూనివర్సటీ విద్యార్థులతో గవర్నర్ తమిళిసై మాటామంతీ

Share with

ఈ రోజు తెలంగాణాలోని వివిధ యూనివర్సిటీ విద్యార్థులో గవర్నర్ తమిళి సై  రాజ్ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బాసర IIITవిద్యార్థులు కూడా పాల్గొన్నారు.  రాష్ట్ర యూనివర్సిటీల ఛాన్సలర్ హోదాలో ఆమె ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఇటీవల  రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీ, మరియు అనేక సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆందోళనలు చేపట్టిన అంశాలపై చర్చ జరిగింది. వారి సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. . ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారికి ఆహారం, ఆరోగ్యం విషయాలలో ఎదురయ్యే ఇబ్బందులు, వాటికి పరిష్కారమార్గాలను, ఈ సమావేశంలో ముఖ్యాంశాలయ్యాయి. విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కావాలని అడుగుతున్నారనీ, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానన్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు మంచి ఆహారం, క్వాలిటీ విద్య, వసతి, ఉద్యోగాలను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాసర ఐఐఐటీలో జరిగిన ఫుడ్ పాయిజన్ విషయమై ఆమె ఆందోళనను వ్యక్తం చేసారు. ఒక డాక్టరుగా వారి బాధను అర్థం చేసుకున్నానన్నారు. ఐఐఐటికి వస్తానని మాటిచ్చారు. ఇంకా 75 కాలేజీలకు వచ్చి వారితో మాట్లాడతాననీ చెప్పారు. తను వారికి ఎంత చేయగలిగితే అంత  సహకారం అందిస్తానన్నారు. 75 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ జాతీయ పతాకాలు పంపిణీ చేసారు. ప్రతీ ఇంటిలో ఆగస్టు 13 నుండి 15 వరకూ జెండా ఎగురుతూ ఉండాలని ఆకాంక్షించారు.