రాజీవ్ గాంధీ వల్లే ఈ హక్కు లభించింది…రేవంత్ రెడ్డి
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. సచివాలయం వద్ద రాజీవ్ విగ్రహానికి నివాళులర్పిస్తూ రాజీవ్ దేశ ప్రధానిగా వన్నె తెచ్చారని పేర్కొన్నారు. భారత్‌ను బలమైన శక్తిగా నిలబెట్టారన్నారు. ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటుహక్కు కల్పించిన ఘనత రాజీవ్‌దేనన్నారు. 18 ఏళ్లకే ఓటుహక్కు కల్పించడం వల్లే యువత రాజకీయాలలో భాగస్వామ్యం పొందారని పేర్కొన్నారు. సెక్రటేరియట్ వద్ద రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సంకుచిత మనస్తత్వంతో కొందరు విమర్శలు చేశారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ దేశరక్షణ, భద్రత విషయంలో రాజకీయాలు చేయదని పేర్కొన్నారు.

