ఇది అసెంబ్లీ, గాంధీ భవన్ కాదు..
నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్ లా కాదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. అసెంబ్లీ నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందంటూ.. స్పీకర్ సభ నడుపుతున్న తీరును నిరసిస్తూ సభ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. గాంధీభవన్ తరహాలో కాకుండా అసెంబ్లీని అసెంబ్లీగా నడపాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల్లో కనీసం తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒకవేళ అవకాశం ఇచ్చినా మాట్లాడుతుండగానే మైక్ కట్ చేస్తున్నారని ఇదేం పద్దతి అంటూ అక్బరుద్దీన్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండటం బాధాకరమని అన్నారు.

