NationalNewsNews Alert

మీ నాటకాలిక సాగవు – శిండే సర్కార్ కుప్పకూలుతుందన్న థాక్రే

Share with

మహారాష్ట్రలో రాజకీయాలు మహారంజుగా సాగుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మాజీముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తన తండ్రికి మద్దతుగా నిలబడ్డాడు.. యువసేన చీఫ్, మాజీమంత్రి అయిన ఆయన కొంకణ్ ప్రాంతంలో పర్యటిస్తూ, ద్రోహాన్ని మహారాష్ట్ర ప్రజలు ఎన్నడూ సహించబోరనీ, శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని సోమవారం శివసేన కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. శిందే ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని, సంక్షేమ పథకాలపై కాకుండా డర్టీ పాలిటిక్స్‌పై దృష్టి పెట్టిందనీ మండిపడ్డారు.

గతనెలలో శివసేన నుంచి ఏక్‌నాథ్ శిండేతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. తర్వాత బీజేపీ మద్దతుతో శిందే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా కొత్తప్రభుత్వం ఏర్పడింది. ఆదిత్య ఠాక్రే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మహారాష్ట్రలో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నా.. వరదలు వస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని, ప్రజలకు ఎవరు అసలైన శివసైనికులో తెలుసనీ, వారే ప్రభుత్వానికి తగిన బుద్ది చెపుతారనీ,  వారి రాజకీయ నాటకాలన్నీ ఇంకా  ఒకటిన్నర నెలలో ముగిసిపోవడం ఖాయమనీ వ్యాఖ్యానించారు.