ఉస్మాన్,హిమయత్‌సాగర్లకు పెరుగుతున్న ఇన్‌ప్లో
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ఘటన మరిచిపోకముందే మళ్లీ వర్షాలు కురుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాత్‌సాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 1300 క్యూసెక్కులు కాగా….నాలుగు గేట్ల ద్వారా 1552 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ జలశయం పూర్తిస్ధాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా… ప్రస్తుతం 1786 అడుగులు వరకు నీరు చేరింది. హిమయత్ సాగర్‌కు 600 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా..రెండు గేట్ల ద్వారా 600 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్ జలాశయం పూర్తిస్ధాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా,ప్రస్తుతం 1761 అడుగుల నీటి మట్టం చేరింది.
Read more: ఆర్మూరు ఎమ్యెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర: సర్పంచ్ భర్త అరెస్ట్