టీడీపీ మూడో జాబితా 11 ఎమ్మెల్యే, 13 ఎంపీ అభ్యర్థులతో విడుదల
టీడీపీ మూడో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 13 మంది ఎంపీ అభ్యర్థులతో పార్టీ విడుదల చేసింది.పలాస నుంచి గౌతు శిరీష్‌కు పార్టీ టికెట్ కేటాయించింది. పాతపట్నం నుంచి మామిడి గోవింద్ రావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి అయితాబత్తుల ఆనందరావుకు పార్టీ టికెట్ కేటాయించింది. ఇక పెనమలూరు నుంచి బోడె ప్రసాద్, మైలవరం నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు, నరసరావుపేట నుంచి డా్కటర్ చదలవాడ అరవింద్ బాబుకు, చీరాల నుంచి మద్దులూరు మాలకొండయ్య యాదవ్‌కు, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టికెట్ కేటాయించారు.
ఇక శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్టణం మాత్కుమిల్లి భరత్, అమలాపురం గంటి హరీష్ మాధుర్, ఏలూరు పుట్టా మహేష్ యాదవ్, విజయవాడ కేశినేని శివనాథ్ (చిన్ని), గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట-లావు శ్రీకృష్ణ దేవరాయలు, బాపట్ల-టి కృష్ణ ప్రసాద్, నెల్లూరు-వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు-దగ్గమళ్ల ప్రసాదరావు, కర్నూలు-బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు), నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపూర్-బీకే పార్థసారధికి సీట్లు కేటాయించారు.

