భార్యను ఫాలో అవుతున్నారని ..
ఓ వివాహిత విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో తనను ఎవరో ఫాలో చేస్తున్నారని భర్తకు కాల్ చేసి చెప్పింది. దీంతో అక్కడికి చేరుకున్న భర్త అనుమానంతో ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించగా.. వారి మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో హైదరాబాద్ లోని సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన శివకుమార్ ఇంటిపై సురేశ్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తమపై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ PSలో బాధితులు ఫిర్యాదు చేశారు.

