తండేల్ లో అసలైన ప్రేమికులు వీరే..
తండేల్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శ్రీకాకుళం జిల్లా కె. మత్స్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్ చిత్రాన్ని తెరకెక్కించారు. కె. మత్స్యలేశం గ్రామస్థులు కొందరు వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీకి చిక్కడం, 14 నెలల తర్వాత రిలీజ్ కావడం, వారి కుటుంబాలు పడిన ఆవేదన అంతా ఈ చిత్రంలో చూపించారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ సినిమాతో తమ గ్రామం పేరు మారుమ్రోగిందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రలన్నీ కూడా తమ గ్రామస్థులవే కావడంతో ఇప్పుడు తమ గ్రామం, తాము చిన్నపాటి సెలబ్రిటీలుగా మారిపోయామని కె. మత్స్యలేశం గ్రామస్థులు తెలిపారు. తండేల్ సినిమాతో కె. మత్స్యలేశం గ్రామాన్ని తండేల్ గ్రామమంటూ ముద్ర పడిపోయిందని అందరూ చెబుతున్నారని గ్రామస్థులు చెప్పారు.

