Home Page SliderTelangana

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు వీరే..! దేశపతికి ఛాన్స్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్ పేర్లను కేసీఆర్ కన్ఫామ్ చేశారు. ముగ్గురు అభ్యర్థులు ఈనెల 9న నామినేషన్ వేయాలని కేసీఆర్ సూచించారు. ముగ్గురు అభ్యర్థుల ఎన్నిక సజావుగా జరిగేలా చూసుకోవాలని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కె. నవీన్‌కుమార్‌ను ఎమ్మెల్సీ స్థానానికి నిలిపి ఇద్దరు కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించారు. దేశపతి శ్రీనివాస్ కవి, ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ డ్యూటీ అధికారిగా పనిచేస్తున్నారు, చల్లా వెంకట్రామి రెడ్డి జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే. ఈ సందర్భంగా కేసీఆర్‌ను కలిసి చల్లా వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇక గవర్నర్ కోటా కింద నామినేట్ చేయాల్సిన ఇద్దరు అభ్యర్థుల పేర్లను త్వరలోనే కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈనెల 9న జరగనున్న కేబినెట్ భేటీ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉంది.