Home Page SliderTelangana

“విమోచన, విలీనం విషయంలో బిజెపి పాత్ర ఏ మాత్రం లేదు”- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి

భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం, విమోచన విషయంలో బిజెపి పాత్ర ఏ మాత్రం లేదు అని విమర్శించారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి. ఆయన సచివాలయ మీడియా పాయింట్ వద్ద సోమవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ ఖ్యాతి అప్పుడు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు, కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేని బీజేపీ సహా ఇతర పార్టీల నాయకులు విమోచన, విలీనం విషయంలో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. విమోచన విలీనం చరిత్ర తెలియకుండానే బిజెపి నాయకులు ఇస్టారీతిన మాట్లాడుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయ్యే నాటికి బిజెపి పుట్టనే లేదన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు మరిచిపోతున్నారు. రాజకీయాల కోసం చరిత్రను విస్మరిస్తే రాజకీయ పార్టీల ఉనికి గాని బిజెపి పరువు గాని బజారుపాలు అవుతుంది.

చారిత్రక నేపథ్యం….

భారతదేశంలో 563 రాజరిక పాలనలు ఉండగా అందులో 560 భారతదేశంలోకి విలీనమయ్యాయి. కానీ హైదరాబాద్, గుజరాత్ లోని జునాగడ్, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాలు మాత్రం భారత దేశంలోకి విలీనం అయ్యేందుకు ఒప్పుకోలేదు. జునాగడ్ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయగా మెజార్టీ ప్రజలు భారతదేశంలోనే విలీనం అయ్యేందుకు ముగ్గు చూపారు. జమ్ము కాశ్మీర్ రాజు హరి సింగ్ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ రంగంలోకి దిగి 370 ఆర్టికల్ సహా పలు నజరాణాలు ఇచ్చి భారతదేశంలోకి విలీనం చేయించారు అయితే హైదరాబాద్ రాష్ట్రం మాత్రం నిజాం ప్రభుత్వం స్వతంత్రంగా ఉండేందుకు మెగ్గుచూపింది.

ఈ విషయంలో పటేల్ రాజనీతిని ప్రయోగించి చాకచక్యంగా వ్యవహరించి భారతదేశంలోకి హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం అయ్యేలా చేశారు. సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎదుట నిజాం ప్రభుత్వం లొంగిపోయింది. విలీనం సమయంలో షరతుల మేరకు నిజామును అప్పటి గవర్నర్ ( రాజ్ ప్రముఖ్ ) నియమించారు. మిలట్రీ జనరల్ చౌదరిని ముఖ్యమంత్రి గా నియమించారు. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమలులోకి రాగా హైదరాబాద్ లో మొదట నిజాం అమలు చేశారు.

1952 లో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు. 1969 తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఇందిరా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని భావించినా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కేసు పెండింగ్ వల్ల అంతర్జాతీయంగా ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు. చివరికి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు.

ఇలాంటి కాంగ్రెస్ చరిత్రను, హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం, విమోచన చేసిన కాంగ్రెస్ పార్టీ చారిత్రక గొప్ప తనాన్ని ఎవరూ కాదనలేరు అని చిన్నారెడ్డి వివరించారు.