‘దేవర’లో ఆపాట లేదు..నిరాశలో ఫ్యాన్స్..
‘దేవర’ చిత్రంలో ఫ్యాన్స్‌ను హుషారు పరిచే దావూదీ సాంగ్‌ను ఎత్తేసినట్లు సమాచారం. సీరియస్‌గా జరిగే స్టోరీ మధ్య ఈ రొమాంటిక్ సాంగ్ ఉండడం సరిపడలేదని మూవీ టీం భావించిందట. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ స్క్రీన్ టైం ఇప్పటికే తక్కువగా ఉందని, అందులో ఈ పాట తీసేయడంతో ఇంకా మిస్సవుతున్నామని అభిమానులు నిరాశపడుతున్నారు. ట్వీట్స్ చేస్తున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ డ్యాన్స్ మిస్సయ్యామని, అందాల తార జాన్వీని మిస్సయ్యామని మెసేజ్‌లు పెడుతున్నారు. అయితే మొదట సినిమా పూర్తయ్యాక టైటిల్స్ వద్ద ఈ పాట పెడదామనుకున్నారట. కానీ పార్ట్ 2కి లీడ్ తర్వాత ఈ సాంగ్ ఉండడం కూడా కరెక్ట్ కాదని భావించి, పూర్తిగా పాటను తీసేశారట.

