జన్మభూమి 2 పై చంద్రబాబు నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జన్మభూమి2ను త్వరలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఏపీలో నైపుణ్య గణనను చేపట్టాలని అభిప్రాయం ప్రకటించారు. త్వరలోనే టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. పేదరిక నిర్మూలనపై ఈ సమావేశంలో విస్తృత చర్చలు జరిగాయి. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా ఎవరిని ఎన్నుకోవాలో తెలంగాణ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయిస్తామన్నారు. తెలంగాణ నేతలకు టీటీడీ బోర్డులో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.