NewsTelangana

ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదు.. జనసేనతోనే పొత్తు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యలు డాక్టర్ కె లక్ష్మణ్. తెలంగాణలో అన్ని అంశాలు బీజేపీకి మరింత బలాన్నిస్తున్నాయని… వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనా లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పార్టీని బీజేపీ స్వాగతిస్తుందన్నారు. ఏపీలో జగన్ సర్కారు అనుకున్న విధంగా పనిచేయడం లేదని.. అక్కడి ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి జనసేనతో ప్రస్తుతం పొత్తు ఉందని… ఆ కలయిక వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్నారు లక్ష్మణ్. బీజేపీ హైకమాండ్.. తనను పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఎన్నుకోవడమంటేనే.. కేంద్ర కేబినెట్ మంత్రి పదవి ఇచ్చినట్టుగా భావిస్తున్నానన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి తర్వాత తనకే చోటు దక్కిందని అది తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానన్నారు.