BusinessHome Page SliderNationalPolitics

స్వాతంత్య్రోద్యమంలో ఆంధ్ర ముస్లిం యోధుల చరిత్ర

భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ఎందరో దేశభక్తుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వతంత్య్ర భారతం. వారిలో మనకు తెలియని ఎందరో మహానుభావులు ఉన్నారు. సాధారణంగా స్వతంత్య్ర సమరయోధులంటే గాంధీ, నెహ్రూ, పటేల్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి వారే గుర్తు వస్తారు. కానీ వేలమంది త్యాగమూర్తుల త్యాగం చరిత్రలో కనుమరుగయిపోయింది. అలాంటి వారిని గుర్తు చేసే చిరు ప్రయత్నమే ఈ “భారత స్వాతంత్య్రోద్యమంలో ఆంధ్ర ముస్లిం యోధులు” అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని రచయిత సయ్యద్ నశీర్ అహ్మద్ రచించారు. ఈ పుస్తకాన్ని పదిమందికీ చేరువ చేయాలని, వేల సంవత్సరాలుగా భారత చరిత్రలో మమేకమైన ముస్లింల దేశభక్తిని అందరికీ చాటి చెప్పాలనే సదుద్దేశంలో ‘ఆరా పోల్ స్ట్రాటజీస్’ సంస్థ ఎండీ ఆరా మస్తాన్ ఈ పుస్తకం ప్రచురణకు అన్నిరకాలుగా ప్రోత్సాహం అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలలో జాతీయోద్యమంలో సహకరించిన, చురుకుగా పాల్గొన్న కొందరు తెలుగు ముస్లింల చరిత్రను మనం తెలుసుకోవాలనేదే వారి ఉద్దేశం. ఈ పుస్తకంలో జిల్లాల వారీగా ఉద్యమంలో పాల్గొన్న ముస్లిం యోధుల పేర్లను పొందుపరిచారు.