NationalNewsNews Alert

కాంగ్రెస్ పార్టీకి ఇక గాంధీలు అక్కర్లేదంటున్న జనం

Share with


దేశ ప్రధానిగా మళ్ళీ నరేంద్ర మోదీయే కావాలని కోరుకుంటున్న వారి సంఖ్య 53 శాతంగా ఉంటే.. ఆ తర్వాత స్ధానం కోసం ఆ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. మంచి పాపులారిటీ ఉన్న నేతలుగా అమిత్ షా మొదటి స్ధానంలో ఉంటే.. ఆతర్వాత యోగి ఆదిత్యనాధ్, నితిన్ గడ్కరీలు ఉన్నారు. ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. ఇక గాంధీలు లేని కాంగ్రెస్ నే చాలా మంది కోరుకుంటున్నారు. 52 శాతం మంది ఇందుకు ఓటేశారు. ఆ వివరాలేంటో చూద్దాం.


బీజేపీని అమేయ శక్తిగా రూపొందించడంతో పాటు రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకు వచ్చిన ఘనత నరేంద్ర మోడీదే. పార్టీకి సొంత బలాన్ని బలగాన్ని పెంచడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఇక రెండుసార్లు ప్రధానిగా ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా .. దేశాన్ని అంతర్జాతీయ వేదికపై గర్వంగా నిలిపిన ఖ్యాతి కూడా ఆయనదే. ఆయన తీసుకున్న కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు బిజేపీకి అఖండ బలాన్ని పెంచాయి. అందుకే తిరిగి ఆయనే మాకు ప్రధాని కావాలంటూ ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో 53 శాతం మంది కోరుకున్నారు. ఇక ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ నిర్వహించిన పాత్రపై కూడా నిర్వహించిన సర్వేలో 40 శాతం మంది పర్వాలేదని ఓటేస్తే.. 34 శాతం మంది విపక్షంలో కూడా కాంగ్రెస్ విఫలమైందని పెదవి విరిచారు. గాంధీలు లేని కాంగ్రెస్ ను 52 శాతం మంది కోరుకుంటే.. 30 శాతం అందుకు నో చెప్పారు. ఇప్పటికీ కాంగ్రెస్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మంచి పాపులారిటీ ఉందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కు ఎవరి వల్ల ఎక్కువ లాభం అన్న ప్రశ్నకు రాహుల్ పక్షాన 23 శాతం మంది నిలబడితే.. మన్మోహన్ పక్షాన 16 శాతం, సచిన్ పైలెట్ కు 14 శాతం, ప్రియాంక గాంధీకి కేవలం 9 శాతం మంది మాత్రమే ఓటేశారు.


దేశంలో ఉత్తమ సిఎం ఎవరంటే ..40 శాతం మంది ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ కు జై కొట్టారు. 22 శాతంతో రెండవ స్ధానంలో అరవింద్ కేజ్రీవాల్ నిలవగా.. 9 శాతంతో మూడో స్ధానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఇక రాష్ట్రాల వారీగా ఉత్తమ సీఎంగా ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను 78 శాతం మంది అంగీకరించారు. ఆ తరవాత 63 శాతం మంది అసోం ముఖ్యమంత్రి హిమాంశు శర్మను రెండవ స్ధానంలో నిలిపితే.. 61 శాతం మంది తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు మూడో స్ధానాన్ని కట్టబెట్టారు. పలు ప్రజారంజకమైన పనులతో ఆయా రాష్ట్రాల్లో వారికి మంచి పేరుంది. వీరిలో 20 ఏళ్లకు పైగా నవీన్ ఒడిస్సా సీఎంగా కొనసాగుతుంటే.. హిమాంశు, స్ఠాలిన్ తొలిసారే ముఖ్యమంత్రులుగా ఎన్నికై ప్రజల మన్ననలు చూరగొంటున్నారు.