Home Page SliderNational

యువకుడిని స్తంభానికి కట్టేసి..

ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి, బెల్టుతో పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ వినోద్ మిశ్రా దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని జౌన్‌పూర్‌లోని ముంగ్రా బాద్షాపూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియరాలేదు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. వినోద్ మిశ్రాను సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.