అక్కడ మహిళా సంఘాలే మున్సిపాలిటీ వర్కర్లు
నాగపూర్ మున్సిపాలిటీ కొత్తగా మహిళా సంఘాలను ప్లాస్టిక్ రీసైక్లింగ్ పనికి నియమించింది. అక్కడ చెత్త చాలా ఎక్కువయిపోవడం, దాని నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను విడదీయడం మున్సిపాలిటీ వర్కర్లకు తలకు మించిన భారం అయిపోయింది. దానితో ఈ పనిని మహిళా సంఘాల సహాయంతో నిర్వహిస్తోంది మున్సిపాలిటీ. కొందరు మహిళలకు ఈ పనిని అప్పగించింది. దానికి తగిన పారితోషకాన్ని కూడా అందజేస్తోంది. ప్లాస్టిక్ బాటిల్స్, డబ్బాలు, పేపర్లు వంటి వాటిని విడదీని, వాటిని రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నారు అక్కడి మహిళలు. దీనితో నగరం చాలా పరిశుభ్రం అవడమే కాదు. ప్లాస్టిక్ పునర్వినియోగం కూడా సాధ్యమవుతోంది.

