ఆ రికార్డులతో ఓటర్ల జాబితా లింక్..
భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓటర్ల జాబితాను జనన, మరణ ధృవీకరణ పత్రాలకు లింక్ చేయనుంది. ఈ అనుసంధానం ద్వారా ఓటర్ల జాబితాలో పొరపాట్లు జరగకుండా చూడాలని భావిస్తోంది. దీనికోసం రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా నుండి ఎలక్ట్రానిక్ రూపంలో తీసుకుంటామని పేర్కొంది. చనిపోయిన వారి కుటుంబాల నుండి విజ్ఞప్తి వచ్చేవరకు వేచి ఉండకుండా ఈ సమాచారంతో నమోదు చేస్తారు. బూత్ స్థాయి అధికారులు వేరుకుని సమాచారం ధృవీకరించుకుంటారు. ఎన్నికల సంఘానికి ఈ సమాచారాన్ని తీసుకునే అధికారం ఉందని వెల్లడించింది. పేర్లను, ఫోటోలను కూడా సరిచూసుకుని సవరించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇకపై బూత్ స్థాయి అధికారులకు కూడా ఫోటో ఐడీ కార్డులను జారీ చేస్తామని తెలిపారు.

