‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైనికుల ప్రతిభ స్పష్టంగా కనిపించింది
‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైనికుల సామర్థ్యం, క్రమశిక్షణ అత్యుత్తమంగా ప్రతిఫలించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పరాక్రమం మాత్రమే కాకుండా, అవసరమైన చోట సంయమనం కూడా ప్రదర్శించడం భారత సైన్యం ప్రత్యేకత అని పేర్కొన్నారు.
“సైనికులు ఎంత అవసరమో అంతే చేశారు. అనుకుంటే ఇంకా ఎక్కువ చేయగల శక్తి, సామర్థ్యం వారికి ఉంది,” అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.బార్డర్ ప్రాంతాల్లో మెరుగుపడుతున్న కనెక్టివిటీ భద్రతా దళాల కార్యకలాపాలకు మరింత బలం చేకూరుస్తోందని ఆయన తెలిపారు. BRO నిర్మించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

