అవినాష్ అరెస్ట్ ఆపలేమన్న సుప్రీం కోర్టు, ఇక సీబీఐ దూకుడేనా..!?
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు నిలిపివేసింది. అదే సమయంలో వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు రెండు నెలల పాటు సుప్రీం కోర్టు పొడిగించింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టింది. అవినాష్ రెడ్డి అరెస్టును ఆపలేమని చెప్పింది. రేపు హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున అప్పటి వరకు అరెస్టు చేయొద్దని కోర్టును అవినాష్ రెడ్డి న్యాయవాది కోరారు. అయితే తాము అలాంటి ఆదేశాలేమీ ఇవ్వబోమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. కేసులో సునీత తరుపున సీనియర్ న్యాయవాది సుద్ధార్థ లూథ్రా కేసు వాదించారు. అవినాష్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కేసు వాదించారు.

