Home Page SliderNational

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

భారత స్టాక్ మార్కెట్ ఈరోజు స్వల్ప నష్టాలతో ముగిసింది. వరుసగా నాలుగో రోజు సూచీలు నష్టపోయినప్పటికీ… ఈరోజు అతి స్వల్పంగా పడిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో వరుస నష్టాలతో సూచీలు ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ టాప్ లూజర్ గా నిలిచింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 2 శాతానికి పైగా క్షీణించింది. సెన్సెక్స్ 16.82 పాయింట్లు నష్టపోయి 80,065 వద్ద… నిఫ్టీ 36 పాయింట్లు క్షీణించి 24,399 వద్ద స్థిరపడ్డాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద ఉంది.