దేశంలో తగ్గనున్న పెట్రోల్,డీజిల్ ధరలు
దేశంలో ఓ వైపు ఎండలు మండిపోతుంటే..మరోవైపు పెట్రోల్,డీజిల్ ధరుల కూడా ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్య,మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే వాహనాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. అదేంటంటే త్వరలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే మొన్నటి వరకు నష్టాల్లో కూరుకుపోయిన ఆయిల్ కంపెనీలు ఈ మధ్య కాలంలో దాదాపుగా కోలుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా త్రైమాసిక ఫలితాల్లోనూ ఈ కంపెనీలు సమర్ధంగా రాణించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్,డీజిల్ ధరలను తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇది దేశంలోని సామాన్య ,మధ్యతరగతి ప్రజలకు కాస్త ఊరట కలిగించే విషయమనే చెప్పాలి.


 
							 
							