తగ్గనున్న వంట గ్యాస్ ధర..?
కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న వంట గ్యాస్ ధర త్వరలో తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎన్జీ, ఎల్పీజీ గ్యాస్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం కూడా ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. గ్యాస్ ధరలను నియంత్రించేందుకు సెప్టెంబరులో ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు ఒక ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు కిరీట్ ఎస్.పరేఖ్ నేతృత్వంలోని కమిటీ గ్యాస్ ధరలను తగ్గించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే సామాన్య ప్రజలకు భారీ ఊరట కలగనుంది. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే.

