రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు
ఏది చేసినా అందులో ఓ అర్థం పరమార్థాన్ని చూడటం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనం. దేశంలో తొలిసారి ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎంపిక చేసిన బీజేపీ… ఉపరాష్ట్రపతిగా ముస్లిం మైనార్టీకి చెందిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీని ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమైన తరుణంలో… దక్షిణాదిపై ఎలాంటి వివక్ష లేదని రుజువు చేసేందుకు దశబ్దాలుగా కళను, సంప్రదాయాలను, సంస్కృతి ఆరాధిస్తున్న నలుగురు దిగ్గజాలను రాజ్యసభకు ఎంపిక చేసి ఔరా అన్పించుకుంటోంది. ఇనాళ్లూ మాటలకే పరిమితమైన పాలకుల కళ్లు తెరిచేలా ఒకేసారి నలుగురు దక్షిణాది వాస్తవ్యులను రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు ఎంపిక చేసింది ఎన్డీఏ సర్కారు.
రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది ప్రముఖులకు రాజ్యసభకు ఎంపిక చేసింది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా, ప్రముఖ దర్శకుడు, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తోపాటు, పరుగులు రాణి పీటీ ఉషా, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేలను నామినేట్ చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్వీట్ చేశారు.రాజ్యసభకు ఎంపికైన ఆ నలుగురి గురించి నేరుగా ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. ఆయా రంగాల్లో నలుగురు ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఇళయరాజా క్రియేటివ్ జీనియస్‌గా దశాబ్దాల తరబడి అనేక జనరేషన్స్ ఉత్తేజపరిచారన్నారు ప్రధాని. ఎన్నో ఉద్వేగాలను పలికించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారన్నారు. భారతీయులందరికీ పీటీ ఉష ఆదర్శనీయురాలని ప్రధాని మోదీ అభినందించారు. దశాబ్దాలుగా క్రియేట్ వరల్డ్ ఆద్యుడిగా విజయేంద్ర ప్రసాద్‌ను కొనియాడారు మోదీ. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలతో ఆకట్టుకున్నారన్నారు. కమ్యూనిటీ సర్వీస్‌లో వీరేంద్ర హెగ్డే అమోఘమైన సేవ చేశారన్నారు మోదీ.. ధర్మస్థల ఆలయం వద్ద ఆయన సేవలను నేరుగా చూశానన్నారు.
ఇళయరాజా దేశం గర్వించదగ్గ సినీ సంగీత దర్శకుడు. పాటల రచయిత, గాయకుడు జూన్ 2, 1943లో జన్మించారు. ఆయన పేరు జ్ఞానదేశికన్. సినిమాల్లోకి వచ్చాక ఆయన పేరును ఇళయరాజాగా మార్చుకున్నారు వివిధ భాషలలో దాదాపు 7 వేల పాటలు, 1400 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ. కన్నడ, మరాఠీ భాషల్లో సత్తా చాటారు. దక్షిణ భారత సంగీతంలో, పాశ్చాత్య సంగీతంలోని విశాలమైన, వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఇళయరాజా గారి నేపథ్య సంగీతంకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1988 లో ఇళయరాజాకి ఇసైజ్ఞాని…సంగీత జ్ఞాని బిరుదు. కళైమామణి పురస్కారంతోపాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్తాయి సింఫనీని కంపోజ్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేసారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఈయనే.
అభిమానులు ఈయనను మేస్ట్రో అని పిలుస్తారు. 2010లో ఈయనకు పద్మభూషణ్ పురస్కారం, 2012 లో సంగీత నాటక అకాడెమీ లభించింది. 2013లో సీఎన్ఎన్-ఐబీఎన్ 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగ సందర్భంగా నిర్వహించిన సర్వేలో ఇళయరాజా దేశంలో అత్యుత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు. 2012లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం, 2014లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినెన్సు పురస్కారాన్ని అందుకున్నారు. 2015లో గోవాలో జరిగిన 46వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సెంటినరీ అవార్డుతో గౌరవించారు. 2018లో భారత ప్రభుత్వం “పద్మవిభూషణ్” పురస్కారంతో సత్కరించింది. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో వినిపించే గిటార్, వయెలిన్‌ను భారతీయ చిత్ర పరిశ్రమలో వాడి… అద్భుత రసాలను పండించారు. 2018లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. తాజాగా దశాబ్దాల తరబడి సినీ ఇండస్ట్రీకి చేస్తున్న సేవకు గాను… ఇళయరాజాను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేశారు.
2015లో డాక్టర్ వీరేంద్ర హెగ్గడేకు పద్మవిభూషణ్ లభించింది. ధర్మాన్ని పునరుద్దరించడానికి మానవజాతి అభివృద్ధికి ఎంతో కృషి చేసాడు. గత 48 సంవత్సరాలలో, నిరక్షరాస్యత, మత అసహనం, పేదరికం, నిరుద్యోగం, సామాజిక కళంకాలు లేదా వైద్య సహాయం లేకపోవడం వంటి సామాజిక అసమానతలతో కొట్టుమిట్టాడుతున్న వారికి అనేక సామాజిక ఆర్థిక కార్యక్రమాలను హెగ్గడే ప్రారంభించారు. ధర్మాధికారిగా హెగ్గాడే స్థాపించిన ధర్మోతన ట్రస్ట్ దీనికి చక్కని ఉదాహరణ. గొప్ప దేవాలయాలు మరియు స్మారక చిహ్నాలను పునరుద్ధరిస్తూ ధర్మభూమికి సేవ చేసుకుంటున్నారు. 1972 నుండి శ్రీ క్షేత్ర ధర్మస్థలలో ప్రతి సంవత్సరం ఉచిత సామూహిక వివాహాల్ని నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 2004 నాటికి ఈ పథకం కింద 10,000 జంటలు వివాహం చేసుకున్నారు. బెంగుళూరు, కల్లహళ్లి, భద్రావతి, మైసూర్, శ్రావణబెళగొళ మరియు బంట్వాల్‌లలో మధ్యతరగతి మరియు అల్పాదాయ కుటుంబాల ప్రయోజనాల కోసం అతను కళ్యాణ మండపాలను నిర్మించాడు.
600 గ్రామాలు మరియు 6 పట్టణాలతో కూడిన కర్నాటక తీర ప్రాంతంలో గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టును ప్రవేశపెట్టాడు. వ్యవసాయ విస్తరణ,సాంకేతికత బదిలీ,మహిళా సాధికారత,ప్రత్యామ్నాయ శక్తి వనరులు,ఆదాయాన్ని పెంచే కార్యకలాపాలు,మైక్రోఫైనాన్స్, విద్య, ఆరోగ్యం మొదలగు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సౌరశక్తిని ప్రోత్సహిస్తూ అనేక గ్రామాలకు విద్యుత్ సౌకర్యాలు కల్పించాడు. 1982లో గ్రామీణ యువతకు స్వయం ఉపాధి మరియు గ్రామీణాభివృద్ధి కోసం వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు సిండికేట్ బ్యాంక్, సిండికేట్ అగ్రికల్చరల్ ఫౌండేషన్, కెనరా బ్యాంక్ సహకారంతో రూరల్ డెవలప్‌మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (RUDSETI)ని స్థాపించాడు. ధర్మస్థల వద్ద అన్నపూర్ణ వంటశాలను నడుపుతున్నాడు, ఇది భారతదేశంలోని అతిపెద్ద మరియు పురాతన కుటుంబం నిర్వహించే వంటశాలలలో ఒకటి. ప్రతిరోజూ దాదాపు 50,000 మందికి ఆహారం అందిస్తుంది. ఇది నేషనల్ జియోగ్రాఫిక్ TV షో “మెగా కిచెన్స్”లో ప్రదర్శించబడింది.
పి.టి. ఉష భారతదేశం అత్యంత విజయవంతమైన అథ్లెట్లలో ఒకరు. ఉష 1964 జూన్ 27న కేరళలోని పయ్యోలి గ్రామంలో… కాలికట్ సమీపంలోని నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఉషను బంగారు బాలిక… పయ్యోలి ఎక్స్‌ప్రెస్ అని అభిమానులు ముద్దుగా పిలుస్తారు. ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్ షిప్‌లలో మొత్తం 30 అంతర్జాతీయ అవార్డులు, 3 బంగారు పతకాలను గెలుచుకుంది. 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో ఒలింపిక్స్‌లో పాల్గొన్న మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత 1982లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో ఆమె రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
పీటీ ఉష 1985వ సంవత్సరంలో జకార్తాలో జరిగిన ఆసియా మీట్‌లో 100మీ, 200మీ, 400మీ, 400మీ హర్డిల్స్, 4×400మీ రిలేలో ఐదు బంగారు పతకాలు సాధించారు. 4×100మీ రిలేలో కాంస్య పతకాన్ని సాధించింది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో, ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె 1986 సియోల్ ఆసియా క్రీడలలో నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని కైవసం చేసుకుని, ఆసియా స్ప్రింట్ క్వీన్ బిరుదును సంపాదించుకుంది. 1998లో టీమ్ సభ్యులతో కలిసి 4×100 మీటర్ల రిలేలో 44.43 సెకన్లలో జాతీయ రికార్డును నెలకొల్పింది. ఈ రికార్డు ఇప్పటికీ ఇలాగే ఉంది. అథ్లెటిక్స్‌లో బాలికలకు శిక్షణ ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి ఉష కేరళలోని కోయిలాండిలో అథ్లెటిక్ పాఠశాలను ప్రారంభించారు.
విజయేంద్ర ప్రసాద్ గా ప్రసిద్ధిచెందిన తెలుగు సినీ రచయిత పూర్తి పేరు కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్. సుప్రసిద్ధ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి ఇతని కుమారుడే.
ఈయన కథలను అందించిన హిట్ సినిమాలలో కొన్నింటి పేర్లు. జానకీ రాముడు (1988), బొబ్బిలి సింహం (1994) కథ, ఘరానా బుల్లోడు (1995) కథ, సంభాషణలు, అర్థాంగి (1996) దర్శకుడు, సమరసింహా రెడ్డి (1999) కథ, స్క్రీన్ ప్లే, సింహాద్రి (2003) కథ, సై (2004) కథ, విజయేంద్ర వర్మ (2004) కథఛత్రపతి (2005) కథ, ఛత్రపతి (2005) కథ, విక్రమార్కుడు (2006) కథ, యమదొంగ (2007) కథ, మగధీర (2009) కథ, మిత్రుడు (2009) కథ, బాహుబలి (2015, 2016) కథభజరంగీ భాయ్ జాన్ (2015) కథ,రాజన్న (2011) (దర్శకుడు, సంభాషణల రచయిత), శ్రీవల్లీ (2017) (దర్శకుడు), శ్రీకృష్ణ (2006) (దర్శకుడు), మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ ప్రభుత్వం 2022 జూలై 6న రాజ్యసభకు నామినేట్ చేసింది.