NewsTelangana

విజయేంద్రుడికి రాజేంద్రుడి అభినందనలు

Share with

రాజ్యసభకు ఎంపికైన సీనియర్ దర్శకులు, కథ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను కలిసి అభినందించారు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. దేశ సేవలో విజయేంద్ర ప్రసాద్ భాగస్వామ్యులవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. పార్లమెంట్‌లో ప్రజాపయోగమైన చర్చల్లో… తెలుగు ప్రజల పక్షాన వాదనలు సమర్థవంతంగా విన్పించాలని సూచించారు. ఈటల ఆప్యాయతకు ఆనందం వ్యక్తం చేశారు విజయేంద్రప్రసాద్. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.