NationalNews

యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రి, కూతురు…

Share with

ఢిల్లీ భారత వైమానిక దళం IAF చరిత్రలో అరుదైన సంఘటన చోటుచేసుకొంది. పైలెట్ ట్రైనర్ సంజయ్ శర్మ, కూమార్తె అనన్యతో కలిసి యుద్ధ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారు. 1989 వైమానిక దళంలో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా చేరిన శర్మ అడుగు జాడల్లోనే నడిచింది కుమార్తె అనన్య. సైన్యంలో చేరి దేశానికి సేవలందించాలని నిశ్చయించుకుంది. తండ్రి పట్టుదల చూసి తాను కూడ దేశానికి మంచి పేరు తేవాలని భావించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన అనన్య 2016లో వైమానిక మహిళా ఫైటర్ పైలట్ల బృందంలో చోటు సంపాదించుకొంది. గత ఎడాది డిసెంబర్‌లో ఫైటర్ పైలట్ నియామకం పొందింది. బీదర్‌లోని ఎయిుర్ ఫోర్స్ సేష్టన్‌లో ఎయిర్ క్రాఫ్ట్‌లో తండ్రి, కూతురు ప్రయాణించి చరిత్ర సృష్టించారు. తండ్రి, కూతురు ఒకే ఫ్లయిట్లో ప్రయాణించి… చరిత్రలోనే తొలిసారి రికార్డు సృష్టించినట్టు ఎయిర్ ఫోర్స్ పేర్కొంది . ఓకే విమానంలో తండ్రితో కలిసి ప్రయాణించడం చాలా సంతోషకరంగా ఉన్నట్లు అనన్య తెలిపింది. తండ్రి సంజయ్ శర్మకు ఫైటర్ విమానాలు నడపడంలో విశేష అనుభవం ఉంది. యుద్ద విమానాలు నడిపించడంలో ఆయన ఎందరికో శిక్షణ ఇచ్చారు. కుమార్తెకు శిక్షణ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్టర్లో హర్షం వ్కక్తం చేశారు.