లయరాజ.. ఇళయ రాజా పయనం
ఇళయరాజా దేశం గర్వించదగ్గ సినీ సంగీత దర్శకుడు. పాటల రచయిత, గాయకుడు జూన్ 2, 1943లో జన్మించారు. ఆయన పేరు జ్ఞానదేశికన్. సినిమాల్లోకి వచ్చాక ఆయన పేరును ఇళయరాజాగా మార్చుకున్నారు వివిధ భాషలలో దాదాపు 7 వేల పాటలు, 1400 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ. కన్నడ, మరాఠీ భాషల్లో సత్తా చాటారు. దక్షిణ భారత సంగీతంలో, పాశ్చాత్య సంగీతంలోని విశాలమైన, వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఇళయరాజా గారి నేపథ్య సంగీతంకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1988 లో ఇళయరాజాకి ఇసైజ్ఞాని…సంగీత జ్ఞాని బిరుదు. కళైమామణి పురస్కారంతోపాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్తాయి సింఫనీని కంపోజ్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేసారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఈయనే.
అభిమానులు ఈయనను మేస్ట్రో అని పిలుస్తారు. 2010లో ఈయనకు పద్మభూషణ్ పురస్కారం, 2012 లో సంగీత నాటక అకాడెమీ లభించింది. 2013లో సీఎన్ఎన్-ఐబీఎన్ 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగ సందర్భంగా నిర్వహించిన సర్వేలో ఇళయరాజా దేశంలో అత్యుత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు. 2012లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం, 2014లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినెన్సు పురస్కారాన్ని అందుకున్నారు. 2015లో గోవాలో జరిగిన 46వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సెంటినరీ అవార్డుతో గౌరవించారు. 2018లో భారత ప్రభుత్వం “పద్మవిభూషణ్” పురస్కారంతో సత్కరించింది. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో వినిపించే గిటార్, వయెలిన్‌ను భారతీయ చిత్ర పరిశ్రమలో వాడి… అద్భుత రసాలను పండించారు. 2018లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. తాజాగా దశాబ్దాల తరబడి సినీ ఇండస్ట్రీకి చేస్తున్న సేవకు గాను… ఇళయరాజాను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేశారు.