NewsTelangana

ప్రధాన మంత్రి బుద్ధి మార్చుకుంటాడనే నీతి ఆయోగ్ బహిష్కరణ

Share with

నీతి ఆయోగ్ సిఫారసులను పట్టించుకోనప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటూ విమర్శించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఢిల్లీ వెళ్లడం వల్ల ఖర్చులు తప్ప… ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అందుకే సమావేశాలను బహిష్కరిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు.. నీతి ఆయోగ్ 24 వేల కోట్లు ఇవ్వాలంటే 24 పైసలివ్వలేదన్నారు. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు నిధులివ్వనప్పుడు… ఇక ఆ సంస్థ అవసరం ఏముందన్నారు. ఢిల్లీలో నీళ్లు కూడా దొరకడం లేదని.. అలాంటప్పుడు నీతి ఆయోగ్ వల్ల ఉపయోగం ఏముందన్నారు. ఇటీవల రాష్ట్రాల అప్పులపై కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చి… అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి బ్రేకులు వేస్తున్నారన్నారు. హిరణ్యకసిపుడంతోడు ఏమయ్యాడో చూశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను నాశనం చేస్తూ… జేబు సంస్థల్లా వాడుతున్నారన్నారు. ఇవే మిమ్మల్ని కబళిస్తాయన్నారు. క్రియకు ప్రతి క్రియ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఎక్ నాథ్ షిండేలను సృష్టిస్తారా? బెంగాల్‎లో ఒకరు తమిళనాడులో ఒకరు… తెలంగాణలో ఒకరు.. ఇలా మాట్లాడతారా.. ఇంత అహంకారమా… ఇదేనా సమైఖ్య స్ఫూర్తా… ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. ప్రజా సంఘాలంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకన్నారు. రైతులు 13 నెలలు ఆందోళన చేశాక.. తప్పయిందని చెప్పారన్నారు. కానీ ఆ తర్వాత కనీస మద్దతు ధర ఇవ్వలేదని, రైతు సంఘాలతో చర్చించలేదని విమర్శించారు. ఏ రోజుకు ఆ రోజు అన్నట్టుగా చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. కేంద్రం ఆలోచనలో పరివర్తన రావాలని కోరుకుంటున్నానన్నారు. ప్రధాని ఇకనైనా దేశం కోసం ఆలోచించాలన్నారు. తెలంగాణ డిమాండ్లను పట్టించుకుంటారని ఆశిస్తున్నానన్నారు.