ఎన్నికలెప్పుడొచ్చినా సై…
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని… పార్టీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టంగా చెప్పారన్నారు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నిన్నటి ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో… టీఆర్ఎస్ నేతలు కుళ్లుకుంటున్నారన్నారు. బోనాలకు వచ్చినంత జనాలు రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. పార్టీ మీటింగ్‌ని బోనాలతో పోల్చడం దుర్మార్గమన్నారు. మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని… త్వరలోనే ఆ భ్రమలు తొలగిపోతాయన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహిస్తున్న సమయంలో… బీజేపీ ఆలోచనలు, ప్రజలకు తెలియకుండా ఉండాలని… ప్రజల దృష్టి మరల్చేందుకు… ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి కేసీఆర్ ఆనందం పొందారని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలు జరిపించినా… బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు ఈటల రాజేందర్.