NewsTelangana

మోదీ మంచి మిత్రుడన్న కేసీఆర్

Share with

ఉచితాలు తప్పు ఐతే NPAలకు ఎందుకిస్తున్నారని ఎదురు ప్రశ్నించారు కేసీఆర్. NPAల పేరుతో బిగ్ స్కామ్ నడుస్తోందన్నారు. కమీషన్లు తీసుకొని NPAలు ప్రకటిస్తున్నారన్నారు. NPAలు పది రెట్లు ఎందుకు పెరిగాయో మోదీ చెప్పాలన్నారు. పాలపైనా, అంత్యక్రియలపైనా పన్ను వేస్తారా అంటూ దుయ్యబట్టారు కేసీఆర్. ఎయిర్ పోర్టులు, రైల్వేలు, విద్యుత్ అంతా ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ దొంగలకు కట్టబెడుతున్నారన్నారు. దేశంలో ఒకే పార్టీ పాలన ఉంటుందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఎలా అంటారని కేసీఆర్ ప్రశ్నించారు. ఇదేనా టీమిండియా స్ఫూర్తి… ఇదేనే కోఆపరేటివ్ ఫెడరిలజం అని దుయ్యబట్టారు. ప్రస్తుతం 36 లక్షల పింఛన్లు ఇస్తున్నామని స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా మరో 10 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నామన్నారు కేసీఆర్. 57 ఏళ్లు నిండినవారందరికీ ఈనెల నుంచి పింఛన్లు అందిచబోతున్నామని చెప్పారు. స్వాతంత్ర వజ్రోత్సవాల కానుకగా పింఛన్లు ఇస్తున్నామన్నారు కేసీఆర్ ఉచితాలు బంద్ చేయాలని కొత్త దుకాణం మొదలుపట్టారని మండిపడ్డారు కేసీఆర్. రైతులు బాధల్లో ఉన్నారని రైతుబంధు ఇస్తే తప్పా అంటూ మండిపడ్డారు. మోదీకి నాపై కోపం వచ్చినా బాధ లేదన్నారు. దేశానికి తెలియాలనే సమావేశాలకు వెళ్లడం లేదన్నారు. మీటింగ్ వెళ్లడం వల్ల ఉపయోగం లేదన్నారు. మోదీ మంచి మిత్రుడన్నారు కేసీఆర్. ప్రజల ప్రయోజనాల కోసం సంఘర్షిస్తామన్నారు కేసీఆర్. ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటారన్నారు.