NationalNews

కొలువుదీరిన నూతన ప్రభుత్వం

Share with

బీహార్‌ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదవసారిగా నితీశ్‌కుమార్‌ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కూడా ప్రమాణం స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి లాలూ సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి సహా పలువురు నేతలు హాజరయ్యారు. నితీశ్‌ కుమార్‌ బీజేపీతో తెగదెంపులు చేసుకొని మహాఘట్‌బంధన్‌తో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.