NationalNews

పశ్చాతాప పడే పనులు మేం చేయడం లేదు…

Share with

తమ పూర్వీకుల వారసత్వాన్ని తమ నుంచి ఎవరూ లాగేసుకోలేరని స్పష్టం చేశారు ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్‌. బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తేజస్వీ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ… ప్రజలను బెదిరించడం, కొనడం మాత్రమే బీజేపీకి తెలుసు, బీహార్‌లో బీజేపీ అజెండా అమలు కావద్దని మేము కోరుకున్నామన్నారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తామని జేపీ నడ్డా అన్నారని తేజస్వీ వివరించారు. నాడు అద్వానీ రథాన్ని లాలూజీ నిలువరించిన విషయం అందరికీ తెలుసని తేజస్వీ అన్నారు. పశ్చాత్తాప పడే పనులు తాము చేయడం లేదన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే నితీశ్‌ కుమార్‌కు సీఎం పదవి, తేజస్వీకి డిప్యూటీ సీఎంతో పాటు హోం మంత్రి శాఖ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.