NewsTelangana

బీజేపీవి బ్యాక్‌ డోర్‌ పాలిటిక్స్‌

Share with

మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా విక్టరీ టీఆర్‌ఎస్‌దేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌ దోమలగూడలోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మోడల్‌ హైస్కూల్‌లో వన మహోత్సవ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో ముచ్చటిస్తూ… మునుగోడులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లేకపోయినా.. అభివృద్ధి ఆగలేదని, బీజేపీ బ్యాక్‌ డోర్‌ పాలిటిక్స్‌ చేస్తుందని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. హుజుర్‌ నగర్‌, నాగార్జున సాగర్‌ లాగే మునుగోడులో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురుతుందన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదని… ప్రజా సంక్షేమానికి కేసీఆర్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.