NationalNews

ఆ డబ్బు నాది కాదు మంత్రిదే

Share with

బెంగాల్‌ ఉపాధ్యాయ నియామక కుంభకోణంపై విచారణ మొదలుపెట్టిన… ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సినీనటి, మోడల్ అయిన అర్పితా ముఖర్జీ ఇంట్లోనూ దాడులు చేశారు. ఆమె ఇంట్లో కళ్లు చెదరిలా ఏకంగా 20 కోట్ల రూపాయల డబ్బు కట్టలుగా లభ్యమైంది. ఈ కేసులో బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీతో పాటు ఆయన సెక్రటరీ సుకాంతా ఆచార్యను, పార్థ చటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని అరెస్టు చేసినట్టు ఈడీ వెల్లడించింది .

పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన దాడుల్లో 20 కోట్ల రూపాయల కట్టల గుట్టలు లభించడంతో దేశవ్యాప్తంగా సంచలనవార్త అయ్యింది. కాగా ఈడీ కస్టడీలో విచారణలో భాగంగా అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు అంతా అప్పటి విద్యాశాఖా మంత్రి పార్థాఛటర్జీదేనని అర్పితాముఖర్జీ ఒప్పుకున్నారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించడానికి వారు 12 నకిలీ సంస్థలను నడుపుతున్నారని తేలింది. ఇంతలో అనారోగ్యమంటూ ఆస్పత్రిలో చేరిన మంత్రి బాగానే ఉన్నారని, చికిత్స అనవసరమని భువనేశ్వర్ ఎయిమ్స్ వెల్లడించింది. పార్థాఛటర్జీ, అర్పితలను ఆగస్టు 3వ తేదీ వరకు ఈడీ కస్టడీలోకి అప్పజెప్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. అర్పిత, పార్థా కలిసి ఒక ఆస్తిని కొనుగోలు చేసినట్లు తేలగా, ఆ ఆస్తి పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.  అర్పిత ఇంట్లో దొరికిన గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు, ఫలితాలు, అపాయింట్‌మెంట్ లెటర్లను కూడా ఈడీ కస్టడీలో తీసుకుంది.