అవినీతి అంతానికి జగన్ పంతం…
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సేవల్లో అక్రమాలకు తావులేకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం అన్నారు. అవినితిపై ఫిర్యాదుకు ఏసీబీ నంబర్ ‘14400’ పోస్టర్‌ను ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. 14400 నంబర్‌కు వచ్చే ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకొని …తీసుకున్న చర్యలపై నివేదిక పక్కాగా ఉండాలన్నారు. సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీవో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. 14400తో పోస్టర్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు .