గవర్నమెంట్ ఆసుపత్రులలో కూడా ఆ మందు ఇవ్వాలి :కవిత
నల్గొండ : నల్గొండలోని జనంబాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రసవ సమయంలో మహిళలకు వచ్చే భరించలేని నొప్పిని అరికట్టే ఎపిడ్యూరల్ అనే మత్తుమందుని ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ఈ మందును ప్రైవేట్ ఆసుపత్రులలో ఇస్తున్నారని, పేద మహిళలు డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తారని, వారికి కూడా బాధ నుండి విమోచనం కోసం ఈ మందు ఇవ్వాలన్నారు. తనకు బీఆర్‌ఎస్ పాలనలో ఈ ఆలోచన రానందుకు తెలంగాణ ఆడబిడ్డలు తనను క్షమించాలన్నారు.

