Home Page SliderNationalNewsSportsTrending Today

ఐపీఎల్ ఫైనల్ నేడే.. కప్ గెలిచే సత్తా ఎవరిది?….

2025 ఐపీఎల్ సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ అంచనాల నడుమ ప్రారంభించింది. జట్టు స్థిరత్వం, కొత్త టాలెంట్, మారిన వ్యూహాలతో కూడిన ఈ సీజన్‌లో, వారు ఫైనల్‌కు చేరడంతో ఆర్సీబీ టైటిల్ గెలవగలదా?” అనే ప్రశ్నకు కొత్త ఉత్కంఠ నెలకొంది. నేడు (జూన్ 3న) జరిగే ఫైనల్లో వారు పంజాబ్ కింగ్స్‌ను ఢీకొనబోతున్నారు. 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న టైటిల్ ఆశలకు ఈసారి ముగింపు రావచ్చన్న నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టోర్నీలో అత్యంత నిలకడగా ఆడిన జట్లే ఫైనల్‌కు వచ్చాయి. పంజాబ్‌ 14 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లతో అగ్రస్థానంతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. బెంగళూరు సైతం అన్నే పాయింట్లు సాధించినా… నెట్‌ రన్‌రేట్‌లో కొంచెం వెనుకబడి రెండో స్థానంతో ముందంజ వేసింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్‌లో బెంగళూరు ఘనవిజయంతో ఫైనల్‌ చేరగా… రెండో క్వాలిఫయర్‌లో ముంబయిని ఓడించి పంజాబ్‌ తుదిపోరుకు అర్హత సాధించింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ 88 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. సరిసమానంగా చెరో 18 మ్యాచుల్లో విజయం సాధించాయి. సమరంలో సమజఉజ్జీలుగా ఉన్న ఆర్ఫీబీ, పంజాబ్‌ కింగ్స్‌ ఈసారి తుదిపోరులో తలపడనున్నాయి. ఉత్కంఠగా సాగే ఈ పోరు క్రీడాభిమానులకు కనులకు పండగే అని చెప్పొచ్చు. క్వాలిఫయర్‌- 1లో ఆర్ఫీబీ, పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించడం బెంగళూరుకు సానుకూలాంశం. టైటిల్‌ను ఎగరేసుకుపోయేలా బలంగా కనిపించిన ముంబయి ఇండియన్స్‌ను క్వాలిఫయర్‌- 2లో ఓడించడంతో పంజాబ్‌ కింగ్స్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీంతో ఈ రెండు జట్లలో ఎవరు విజేతగా నిలుస్తారో అని ఇరు జట్ల అభిమానులు ఉత్కంఠకు గురవుతున్నారు.