మళ్లీ మొదలైన మారణహోమం…200మంది మృతి..
గాజాలో మరోసారి ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య పోరు నివురుగప్పిన నిప్పులా కొన్ని రోజులు విరామం ఇచ్చినట్లే ఇచ్చి, మరోసారి భగ్గున లేచింది. హఠాత్తుగా బాంబుల వర్షం కురిపించడంతో గాజాలో సామాన్య పౌరులు, చిన్న పిల్లలతో సహా 200 మంది మృతి చెందారని తెలుస్తోంది. అయితే ఈ దాడులకు ముందు తమకు సమాచారం అందిందని అమెరికాలోని వైట్‌హౌస్ వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందాలను సరిగా పాటించడం లేదంటూ హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బందీలను విడుదల చేయాలంటూ, ఇజ్రాయెల్‌కు కావలసిన ప్రతీ ఒక్కటీ పంపుతానని, చెప్పినట్లు చేయకపోతే ఒక్క హమాస్ వ్యక్తి కూడా ప్రాణాలతో ఉండడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించినా హమాస్ పట్టించుకోలేదని ఇజ్రాయెల్ ఆరోపించింది.

