Home Page SliderNational

‘కపిల్‌ షో’లో సందడి చేసిన ‘దేవర’ టీం

‘ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ అంటే కామెడీ ప్రేక్షకులకు కన్నులపంటే. ఇక ఆ షోకి ‘దేవర’ టీం వచ్చిందంటే.. షో సూపర్ హిట్ అయినట్టే. అందాల తార జాన్వీ కపూర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌లు కపిల్ షోలో సందడి చేశారు. ఎన్టీఆర్ చక్కటి హిందీ మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. శనివారం సాయంత్రం 8గంటలకు  నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది ఈ ఎపిసోడ్. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ స్టెప్స్, జాన్వీ బ్యూటిఫుల్ మూమెంట్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ షోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ జాన్వీకి రెండుసార్లు తాను భోజనం పంపించానని, కానీ జాన్వీ తాను వంట చేసుకుని తానే తినేసిందని, తనకు కొంచెం కూడా పెట్టలేదని కామెడీ చేశారు. బాహుబలి స్కిట్ కూడా హాస్యంగా ఉంది. సైఫ్ అలీఖాన్ డైలాగులు, తారక్ పంచ్‌లతో షో ఆద్యంతం ప్రేక్షకులను అలరించగలదని ప్రోమో చూసినవారికి అనిపిస్తోంది. ఈ రోజు షో చూడడానికి ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.