ఇద్దరు యువ సాఫ్ట్ వేర్ల దుర్మరణం
హైద్రాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువ సాఫ్ట్ వేర్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.కాకినాడుకు చెందిన వెంకన్న స్వామి, విశాఖకు చెందిన దేవకుమార స్వామి అనే యువకులు హైద్రాబాద్లోని అమెజాన్,మైక్రో సాఫ్ట్ సంస్థల్లో పనిచేస్తున్నారు.నానాక్ రామ్ గూడలోని ఓ పిజి హాస్టల్లో ఉంటూ ఉద్యోగాలకు వెళ్తున్నారు.శుక్రవారం ఇద్దరూ కలిసి బైక్ పై సెకండ్ షోకి వెళ్లారు. సినిమా ముగించుకుని హాస్టల్ కి బయలుదేరుతుండగా ఐఐఐటి జంక్షన్ సమీపంలోకి రాగానే ఎడవ వైపు ఉన్న డివైడర్ని అదుపుతప్పి ఢీకొట్టారు.బైక్ మీద నుంచి ఎగిరి కింద పడ్డారు. కొద్ది సేపటికి ప్రాణాలు విడిచారు.గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసున్నారు.


 
							 
							