Home Page SliderNationalNews Alertviral

దేశంలోనే మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభం.

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో నూతనంగా దేశంలోనే మొట్ట మొదటి వర్టికల్ విఫ్ట్ సీ బ్రిడ్జ్ ప్రారంభించనున్నారు ప్రధాని మోది. రూ. 535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించిన వంతెనను ప్రధాని మోదీ శ్రీరామనవమి సందర్భంగా పాంబన్ నుండి రిమోట్ పద్దతిలో ప్రారంభించనున్నారు. అనంతరం ప్రత్యేక రైలు ఈ వంతెన ద్వారా రామేశ్వరం నుండి తాంబరం చేరుకుంటుంది. కార్యక్రమం అనంతరం బహిరంగ సమావేశంలో పాల్గొని రూ.8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రధాని రామేశ్వరం ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద పూజలు నిర్వహిస్తారు.