Breaking NewscrimeHome Page Slider

లంచ‌గొండి న్యాయ‌మూర్తిని బ‌ర్త్‌ర‌ఫ్ చేయాలి

ఢిల్లీ హైకోర్ట్‌ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. వర్మ నగరంలో లేని సమయంలో ఆయన అధికారిక నివాసంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.మంటలను ఆర్పిన తర్వాత, అగ్నిమాపక దళ సిబ్బంది బంగ్లాలోని వివిధ గదుల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే జడ్జి ఇంట్లో భారీ మొత్తంలో నగదు బయటపడటంతో భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అక్కడ ఆయన గతంలో అక్టోబర్ 2021 వరకు పనిచేశారు. అక్రమార్జన విషయంలో జస్టిస్ వర్మపై దర్యాప్తుకు ఆదేశించడంతో పాటు అభిశంసన ప్రక్రియపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. జస్టిస్ వర్మను బదిలీ చేయడం వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటుందని, న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం సన్నగిల్లుతుందని కొలీజియంలోని కొందరు న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్ వర్మ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వారు కోరారు. ఒక వేళ రాజీనామాకు ఆయన నిరాకరిస్తే, పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రవేశ పెట్టే అవకాశం ఉందని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు.