తేనీటి విందుకు డుమ్మా కొట్టిన సీఎం
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా తేనీటి విందు రాజ్‌భవన్‌లో నిర్వహించడం ఆనవాయితీ. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకట స్వామి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ రాంచందర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ, సీఎస్ సోమేష్‌కుమార్ ఇతర ప్రభుత్వ అధికారులు, హాజరయ్యారు. సీఎం కేసీఆర్ మాత్రం ఎట్ హోం కార్యక్రమానికి హాజరు కాలేదు. సీఎం రాక కోసం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అరగంటపాటు ఎదురు చూశారు. అయితే సీఎం సాయంత్రం 7 గంటలకు వస్తానని సమాచారం ఇచ్చారని… ఎందుకు రాలేదో తెలియదని గవర్నర్ చెప్పారు. సీఎంతో పాటు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సైతం రాలేదు. కాంగ్రెస్ ప్రముఖ నేతలు కూడా హాజరు కాలేదు.