రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,521 శాంపిల్స్ పరీక్షించగా, 265 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 142 కేసులు నమోదు కాగా, కరీంనగ్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 14 కేసులు గుర్తించారు. 528 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,29,467 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,22,173 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 3,183 మంది చికిత్స పొందుతున్నారు. 4,111 మంది కరోనాతో మృతి చెందారు.