మంత్రిని.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి..
సమంత, నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేగుతోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా మంత్రి కొండా సురేఖపై మండిపడ్డారు. నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయ్యానని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే ఇంటర్ ఫేర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపు నుంచి అడుగుతున్నాము. 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి, తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణమని ట్వీట్ చేశారు.

