తాండూరు, పరిగిల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం ప్రసంగించారు
తాండూరు, పరిగిలో బీఆర్ఎస్ అభ్యర్థులను మీరు గెలిపిస్తే.. ఈ రెండు ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. తాండూరు, పరిగిల్లో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. కర్ణాటక సరిహద్దులో ఉన్న తాండూరులో పాలిటెక్నిక్ కాలేజ్, మైనార్టీ డిగ్రీ కాలేజ్‌లతోపాటు పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తాం. పరిగికి పాలిటెక్నిక్ కాలేజీ తీసుకొస్తాం. గండేడ్, మహమ్మదాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో కలుపుతాం. రోహిత్ రెడ్డి, మహేశ్ రెడ్డిలను గెలిపిస్తేనే 24 గంటల కరెంట్ వస్తుంది. రైతు బంధు అందుతుంది. మీ ఓటు కారు గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన..

