హైకోర్టు తీర్పుతో జగన్‌కు షాక్
సీనియర్ ఐటీ అధికారి కృష్ణ కిషోర్ పై జగన్ సర్కారు పెట్టిన కేసు చెల్లదని జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షత విచారించిన క్యాట్ హైదరాబాద్ బెంచ్ తుది తీర్పునిచ్చింది. 2019 లో వైసీపీ అధికారులు , అధికారంలోకి వచ్చిన తర్వాత … EDB CEOగా ఉన్న కృష్ణ కిషోర్ ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయన అక్రమాలకు పాల్పడ్డారని కొన్ని క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన సస్పెన్షన్‌పై కృష్ణ కిషోర్ క్యాట్‌ను ఆశ్రయించాగా… సదరు ఉత్తర్వులపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది.
ఈ మేరకు విచారణ జరిపిన హైకోర్టు కృష్ణ కిషోర్ పై కావాలనే కేసులు నమోదు చేశారని.. ఆయన హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ సర్కిల్ లో పని చేస్తున్న సమయంలో కృష్ణ కిషోర్… జగతి పబ్లికేషన్‌పై వస్తున్న లాభాలకు పన్ను కట్టమని నోటీసులు ఇచ్చారని కోర్టులో ఆయన తరపున లాయర్లు వాదించారు. అంతే కాకుండా సీఎం జగన్‌పై అప్పటికే ఉన్న కేసుల దర్యాప్తు వహిస్తున్న అధికారి లక్ష్మీనారాయణ సన్నిహితంగా ఉన్న కారణంతోనే కృష్ణ కిషోర్ పై ఈ అక్రమ కేసులు పెట్టారని హైకోర్టు భావించింది. ఉద్దేశ పూర్వకంగానే వైసీపీ సర్కారు కేసుల పెట్టిందని కృష్ణ కిషోర్ పిటిషన్‌లో పేర్కొన్నారు.