కొత్త లబ్ధిదారుల కోసం రూ.137 కోట్లు
అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్తగా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు తాజాగా పథకాలు మంజూరు చేసింది . ఈ మేరకు కొత్త లబ్ధిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు సీఎం జగన్ విడుదల విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పధకాలు అగకూడదన్నారు. అధికారం అంటే అజమాయిషీ కాదని… అధికారం అంటే ప్రజలమీద మమకారం….ప్రజలందరి సంక్షేమం అని పేర్కొన్నారు.
గతంలో వివిధ కారణాల వల్ల అందుకోలేకపోయిన అర్హులందరికీ కూడా ఇవాళ వారి ఖాతాల్లో జమచేస్తున్నామని ప్రకటించారు. మన ప్రభుత్వంలో కులం చూడడంలేదని, వర్గం చూడడంలేదని, పార్టీలు అసలే చూడడంలేదని… అవినీతికి తావులేకుండా, వివక్షకు అవకాశం లేకుండా, పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మొత్తం 3.36 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతిఫలం అందనున్నట్లు చెప్పారు. తాజాగా వైఎస్సార్ పింఛన్ కానుకను 2,99,085 మంది కొత్త లబ్ధిదారులను ఎంపిక చేశారు. కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులను ఏపీ ప్రభుత్వ మంజూరు చేసింది ఏపీ సర్కార్.