డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డ ప్రముఖ హీరోయిన్ సోదరుడు
హైదరాబాద్ మహనగరంలో నిత్యం డ్రగ్స్ కేసులు వెలుగు చూస్తునే ఉన్నాయి. తెలంగాణా ప్రభుత్వం, పోలీసులు రాష్ట్రంలో డ్రగ్స్‌ను కట్టడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. అయినప్పటికీ డ్రగ్స్ సరఫరా,వినియోగాన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారు. అయితే ఈ రోజు కూడా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కాగా రూ.2 కోట్ల విలువైన 200గ్రాముల కొకైన్‌ను నార్కోటిక్, రాజేంద్రనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే వీటిని తరలిస్తున్న 4గురుని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.కాగా వీరిలో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్‌సింగ్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే గతంలో కూడా హీరోయిన్ రకుల్‌పై డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తమ్ముడు అమన్‌సింగ్ డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడడం సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
